లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో బండ్ల పాడు, గొత్తి కోయ గూడెంలో ప్రజలకు సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కష్ట కాలములో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. ఫాం హౌస్ ముఖ్య మంత్రి బయటకు రావాలన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్నారు. కరోనా టెస్టుల శాతం పెంచాలని డిమాండ్ చేశారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న గొత్తికోయ గూడెంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణల నుండి మారుముల గ్రామాలకు కరోనా విస్తరించిందని, ప్రజల ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టెస్ట్ ల శాతం పెంచాలని లాక్ డౌన్ ను కొనసాగించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement