తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాధపడితే ప్రభుత్వం బాగుపడదని.. సీఎం కేసీఆర్ అనేక మాయ మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement