జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా (భారత రాష్ట్ర సమితి) లో కలకలం రేపుతోంది. శ్రావణి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను టార్గెట్ చేయడం, మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం అధికార పార్టీలోని స్థానిక నాయకులలో హీట్ పుట్టిస్తోంది. జగిత్యాల జిల్లా మున్సిపల్ ఛైర్మన్ భోగ శ్రావణి ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించారు. ఛైర్మన్ వ్యాఖ్యలు ఒకింత బాధ కలిగించాయన్నారు.
శ్రావణి చేసిన ఆరోపణల వెనక విపక్షాల కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్. ఆమె ప్రెస్‌మీట్‌ను బీజేపీ ఎంపీలు.. ఫేస్‌బుక్ లైవ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అయితే, ఆమె రాజీనామాపై హైకమాండ్ దే తుది నిర్ణయం అని తెలిపిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే తానని అన్నారు. ‘చైర్‌పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో తన ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను’ అని తెలిపారు.