Friday, November 22, 2024

ప్రభుత్వం ఇచ్చే గొర్రెలతో యాదవ వర్గాలలో ఆర్థిక అభివృద్ధి – ఎమ్మేల్యే రేఖా శ్యామ్ నాయక్

జన్నారం( మంచిర్యాల జిల్లా), (ప్రభ న్యూస్):ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గొర్రెలతో యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఖానాపూర్ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మురిమడుగు గ్రామంలో గొల్ల,కుర్మ లబ్దిదారులకు ఆమె ఆదివారం గొర్రెలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గొర్రెల పంపిణీ పథకం ఎంతో మంచిదన్నారు. తమ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పెట్టిన విధంగా ఇలాంటి పథకాలను ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టలేదని, రైతు బిడ్డ సీఎంగా ఉండడంతో అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాలు తెలిసిన సీఎంగా బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేసే విధంగా పథకాల రూపకల్పన చేశారన్నారు

అనంతరం అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన ప్రవీణ్ ఇటివల అకస్మాత్తుగా ఇంటి పైనుండి కింద పడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్నా ఆమె వారి ఇంటికి వెళ్లి పలకరించి, వారి పిల్లలను చూసి చలించిపోయి పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దళితవాడల్లో పర్యటించి దళిత బంధు పథకం పై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాజారాం రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి పద్మ బుచ్చన్న, వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ భరత్ కుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జనార్ధన్, ఆ గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు భాగ్యలక్ష్మి రాయలింగు, భూమక్క జగన్, పార్టీ మండల నేతలు మెంగన్ వెంకటేష్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement