Friday, November 22, 2024

శిక్షణతో స్వయం ఉపాధి పొందాలి: ఎమ్మెల్యే

ఉట్నూర్ జులై 18(ప్రభన్యూస్) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (ఎన్ఏసి) సంస్థ ద్వారా 90 రోజులపాటు కుట్టు శిక్షణ పొందిన మహిళలు శిక్షణతో స్వయం ఉపాధి పొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్ అన్నారు. శిక్షణ పొందిన మహిళలకు మంగళవారం ఉట్నూరులో ఎమ్మెల్యే కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం కొన్ని సమస్యల ద్వారా కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు యువత యువతీ యువకులు మహిళలు రాణించాలని ఆమె కోరారు

ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఉట్నూర్ఎంపీపీ పంద్రా జయవంతరావు, వైసీపీ దావులే బాలాజీ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కందుకూరి రమేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, ఉట్నూర్ మండల కోఆప్షన్ సభ్యులు షేక్ రషీద్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజీమోదీన్ , సామాజిక కార్యకర్త అంజత్ ఖాన్, శిక్షణ నిర్వాహకులు, శిక్షణ పొందిన మహిళలు , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement