Tuesday, November 19, 2024

తెలంగాణ ధాన్యం మొత్తం కొనాల్సిందే: ఎమ్మెల్యే రెడ్యా నాయక్

తెలంగాణవ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచినా… నేడు కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతన్నలు మళ్ళీ రోడ్డెకాల్సిన పరిస్థితి ఏర్పడిందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. తెలంగాణలో యాసంగి పంట మొత్తం కొనేదాక నిరసన విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కేటీఆర్ పిలుపు మేరకు మరిపెడ మండల కేంద్రంలో చేస్తున్న రైతు నిరసన దీక్షకు హాజరై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపికి పతనం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు వస్తే రైతుల ఓట్లతో గద్దెనెక్కి, అనంతరం వారి బాగోగులు పట్టించకోకపోవడం అప్రజాస్వామికం మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్టాల్లో మాదిరి తెలంగాణలో కూడా ధాన్యం కొనలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, డోర్నకల్ యువనేత రవిచంద్ర, ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, మునిసిప‌ల్ చైర్మెన్ గుగులోత్ సింధూర ర‌వి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement