Tuesday, November 26, 2024

విద్యార్థులకు “సోలార్ స్టడీ ల్యాంప్స్’’.. ఉచితంగా అందించనున్న ఎమ్మెల్యే

నర్సంపేట నియోజకవర్గ0లోని  అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు “సోలార్ స్టడీ ల్యాంప్స్” ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉచితంగా అందజేయనున్నారు. మార్కెట్ లో 700  రూపాయల విలువ గల “సోలార్ స్టడీ లాంప్స్” ను నర్సంపేట నియోజకవర్గ0లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ, హైస్కూల్స్ లతో KGBV, మోడల్ స్కూల్స్ లలో చదివే 6,200 మంది విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులపై ఎలాంటి భారం పడకుండా తానే ఉచితంగా అందించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ విద్యుత్ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలిజేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఛూట్టామన్నారు. కంటికి సురక్షితమైన వెలుగునిచ్చే నాణ్యమైన సోలార్ లాంప్స్ ను నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించే విద్యార్థులకు అందించనున్నట్లు చెప్పారు.  

సోమవారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి సోలార్ లాంప్స్ యొక్క ఆవశ్యకత గురించి తెలిపారు. అలాగే, ప్రభుత్వ  పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన కోసం నిధుల కేటాయింపు చేయనున్నట్లు చెప్పారు. అదనపు భవనాల మంజూరు కొరకు ప్రతిపాదనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement