మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహిళాదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మహిళా సోదరీమణులకు మర్యాదపూర్వక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాది ముభారకు, ఆసరా, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్లు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశ పెట్టారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement