Saturday, November 23, 2024

ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని క‌లిసి – కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ గ్రామీణ వైద్యుల బృందం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ…ఆర్.ఎం.పీ మరియు పి.ఎం.పి వైద్యుల సమస్యల గూర్చి ప్రస్తావిస్తూ.. వారికి తగిన గుర్తింపునివ్వాలని, అనేక ఏండ్ల నుండి వారి సేవలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అందుబాటులో ఉండబడి ప్రాధమిక చికిత్స ద్వారా వైద్యం అందించడంలో ముందు వరుసలో ఉన్నారని, గతంలో మెరుగైన వైద్యం కొరకు వారికి ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరిగిందని.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు జీవనోపాధిలో సముచిత స్థానం కల్పిస్తున్న సందర్భంగా RMP, PMP లను కూడా రానున్న వైద్య-ఆరోగ్య శాఖా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో ఏదో ఒక పద్దతిలో వారికి ప్రాధాన్యత కల్పించి ఎంతో అనుభవంతో కూడిన వారి సేవలను సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రస్తావించిన విషయంపై సానుకూలంగా స్పందించిన గౌరవ వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు గ్రామీణ వైద్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిస్కారం కొరకు తప్పక కృషి చేస్తామని, త్వరలో వారితో సమావేశం నిర్వహించి కూలంకషంగా చర్చిస్తామని బదులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement