కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామానికి చెందిన ముప్పిడి వంశీకృష్ణ (28) ఇటీవలే శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన రూ.2లక్షల విలువ చేసే చెక్కును ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జీడిమెట్ల గ్రామంలో మృతుని నివాసం వద్ద కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూధన్ రాజు, కాలే నగేష్, బాలప్ప, జ్ఞానేశ్వర్, అశోక్, ఇందిరారెడ్డి, గొరిగె అరుణ్, నదీం రాయ్, యేసు, కుల్దీప్ సింగ్ రాథోడ్, ప్రవీణ్ గౌడ్, బిపిన్, యశ్వంత్, గణేష్, మధు, శంకర్, కృష్ణా రెడ్డి, కుటుంబ సభ్యులు పూర్ణ చందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital