సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్ చెరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు మంజూరైన 55 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు పాండు, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సమన్వయం కాదు.. ఇక సమరమే: TRS ఎమ్మెల్యే