Wednesday, November 20, 2024

TG | ద‌ళితబంధు ధ‌ర్నాలో ఉద్రిక‌త్త‌… అప‌స్మార‌కంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హుటాహుటిన హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లింపు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ శ‌నివారం హుజురాబాద్‌లో బీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ధ‌ర్నా ఉద్రిక్త‌త ప‌రిస్థితులకు దారితీసింది. ఉదయం రైతులు, బీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ చౌర‌స్తా వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ ధ‌ర్నాకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎన్ నేతల మధ్య తోపులాట జరిగింది.

కారులోకి బ‌ల‌వంతంగా ఎక్కించిన పోలీసులు..
అనుచ‌ర‌గ‌ణం అడ్డుకున్న‌ప్ప‌టికీ పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గురై స్పృహ కోల్పోయారు. వెంట‌నే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పరిస్థితులతో హుజురాబాద్ పట్టణంలో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎన్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

దళిత బంధు ఇవ్వాలంటే దాడి చేశారు …
రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని నిరసన తెలియజేస్తే పోలీసులు తనపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలియజేశారు. శనివారం హుజరాబాద్ నియోజకవర్గంలో కేంద్రంలో దళిత బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న తనపై పోలీసులు దాడి చేశారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని, త్వరలోనే ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారన్నారు. ప్రశ్నిస్తే దాడులు దాడులు చేయడం ప్రభుత్వానికి అలవాటైపోయిందన్నారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసుల తీరును ఖండించిన హరీష్ రావు…
హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసుల తీరును బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు ఖండించారు. ” అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. అలాగే దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement