Tuesday, November 26, 2024

Flash: గండి చెరువులోకి నీటి విడుదల

యదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి గండి చెరువులోకి సోమవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి జంగంపల్లి, ఓటీ – 2 కాల్వ నీటిని విడుదల చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి క్షేత్రం పరిధిలోని గండి చెరువుకు గోదారి జలాలు రానున్న సందర్భంగా నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్ ప్రధాన కాల్వ నుంచి వచ్చే యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ – 2 కాల్వ ద్వారా నీటిని గండి చెరువులోకి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement