Monday, November 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

ప‌టాన్ చెరు మండలం భానూరు గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. గ్రేడ్ వన్ రకానికి రూ.1860లు, గ్రేడ్ టు రకానికి రూ.1840ల‌ మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ ప‌ర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement