Friday, November 22, 2024

MLA GMR – మార్నింగ్ దేవరకద్ర పేరుతో ప్రజ సమస్యలకు పరిష్కారం చేస్తాం

దేవరకద్ర,డిసెంబర్ 10 (ప్రభ న్యూస్):ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారము మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించి తదుపరి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారానే పరిపాలన సాగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలలో ముందుగా 2 పథకాలను సోనియాగాంధీ జన్మదినం రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకానికి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు.

. గుడ్ మార్నింగ్ దేవరకద్ర పేరుతో నియోజకవర్గంలోని వారానికి నాలుగు గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.  తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

గత ప్రభుత్వ హయంలో యాదవులు గొర్రెల కోసము డబ్బులను కట్టడం జరిగిందని ఇప్పటివరకు వారికి గొర్రెలు మంజూరు కాలేదని ఈ విషయమై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. యాదవులు కూడా నష్టపోకుండా ఉండేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అదేవిధంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట కొరకై నీటిని విడుదల చేసినందుకు సోమవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా మండల ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే గేట్ సమస్యను అండర్ బ్రిడ్జి ఏర్పాటు కొరకై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని అన్ని విధాల సమస్యలు పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు మాదిరిగా తమ ప్రభుత్వం చేయదని ఆయన చెప్పారు.

తదుపరి ఎమ్మెల్యేకు నాయకులు కార్యకర్తలు దుశ్శాలువతో సన్మానం చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్ రెడ్డి లక్ష్మీ కాంత్ రెడ్డి అంజన్ కుమార్ రెడ్డి అంజిల్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి రామకృష్ణారెడ్డి హనుమంత్ రెడ్డి రఘువర్మ స్వప్న కిషన్ రావు సయ్యద్ ఫరూక్ అలీ జమీల్ గోవర్ధన్ రెడ్డి రాంపండు నరేందర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి సుదర్శన్ గౌడ్ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement