Friday, November 22, 2024

మద్దతుధర చెల్లించేందుకే కొనుగోలు కేంద్రాలన్న‌ ఎమ్మెల్యే దాసరి

రైతాంగం కష్టపడి పండించిన వరి పంటకు మద్దతు ధర చెల్లించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కుదురుపాకతో పాటు పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… ఏడేళ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. కేంద్రం వారి కొనుగోలుకు ససేమిరా అంటున్నా రైతాంగం నష్ట పోకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చివరి గింజ వరకు కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. రైతుబంధు, రైతు బీమా ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement