Friday, November 22, 2024

నిరుపేద ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి – ఎమ్మెల్యే దాసరి

పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 53 మంది లబ్ధిదారులకు 53,06,148 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం దేశంలో ఎక్కడా లేదని, నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం భారం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్,జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,వైస్ ఎంపీపీ జూకంటి శిరీష-అనిల్,మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య, రైతు బంధు మండలాధ్యక్షుడు కావేటి నిదానపురం దేవయ్య, ఛైర్మెన్ చదువు రామచంద్రారెడ్డి,గజవెల్లి పురుషోత్తం మాజీ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి,సర్పంచ్ శ్రీదేవి-రాజు, ఎంపీటీసీ సువర్ణ-చంద్రు, ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్ లు,యూత్ అధ్యక్షులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement