తెలంగాణ సీఎం కేసీఆర్ కు శతాయుష్ ప్రసాదించాలని, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం వేకువజామున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారి మొక్కులు చెల్లించిన అనంతరం రంగనాయకస్వామి మండపంలో వేద పండితులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి వస్త్రంతో పాటు ప్రసాదం అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని వేడుకొన్నామన్నారు. ఎమ్మెల్యే వెంట ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.