Friday, November 22, 2024

పేదింటి ఆడ పిల్లలకు వరం కల్యాణ లక్ష్మి

పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాగా మారింది అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ మండపంలో 337 మందికి 3,37,39,092 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని, పేదింటి ఆడపిల్లల వివాహం కోసం లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మీ ద్వారా అందిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడ కళ్యాణ లక్ష్మి లాంటి పథకం లేదని, ఆడపిల్లల వివాహాలు భారం కావద్దని సీఎం రాష్ట్రంలో బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో తమ ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణలక్ష్మి లాంటి ఒక్క పథకం అమలు కావడం లేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement