తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజులపాటు జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయులు కేసీఆర్ అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా మార్చడంతోపాటు అందుకు తగ్గట్లుగా సుందరీకరణ పనులతోపాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.