రైతు పక్షపాతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతాంగ పై వివక్ష చూపినా, రైతాంగం నష్ట పోకుండా ఉండేందుకు ప్రభుత్వం పై వేలాది కోట్ల రూపాయల భారం పడుతున్నా దాన్యం కొనుగోళ్లు ప్రారంభించారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు,ఛైర్మెన్ మోహన్ రావు,సర్పంచ్ కోమల-సారయ్య,ఉప సర్పంచ్ స్వరూప-గంగమల్లు,గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, డైరెక్టర్ లు,డైరెక్టర్ లు,గ్రామ పాలకవర్గం,తెరాస నాయకులు రమేష్, మల్లమ్మ, సారయ్య, సత్యనారాయణ,వనిత, కుమారస్వామి, నరేష్,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.