తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ముప్పిరితొట, ధూళికట్ట గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంటలను కేంద్ర ప్రభుత్వం కొనలేమని ప్రకటించిన సమయంలో అన్నదాతకు అండగా కేసీఆర్ పోరాటం చేశారన్నారు. కేంద్రం దిగి రాకపోయినా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు కష్టం రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించదన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ మండిగ రేణుక రాజనర్సు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.