అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత అందిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు 56,71,500 ల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తూ.గో పేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సరైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. ఏడేళ్లలో వేలాదిమందికి కోట్లాది రూపాయల చెక్కులను అందజేశామన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రత కు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రి గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement