Tuesday, November 26, 2024

నిరుపేదల ఆభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్‌ బీసీ బంధు ప్రవేశపెట్టారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో 300 మంది బీసీ కులవృత్తి లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన బీసీలందరికీ రూ.లక్ష సాయం అందుతుందన్నారు. మొదటి విడుతగా నియోజకవర్గానికి 300 అందిస్తున్నామని, విడతల వారీగా అందరికీ చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలన్నీ ప్రజలకు చేరడంతోనే ప్రజలందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకం కులవృత్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిరంతరంగా బీసీలకు సాయం అందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, రైతు సమన్వయ సమితి నాయకులు, భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement