ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆక్రమణల కూల్చివేతలను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్‌లోని షాదాన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడకు చేరుకున్నారు.
కూల్చివేతలను వెంటనే ఆపాలని అధికారులను కోరారు. తాను స్థానిక ఎమ్మెల్యేనని, తనకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని అధికారులను ప్రశ్నించారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం ఏమిటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకుంటే మాత్రం ఆందోళన చేస్తానని హెచ్చరించారు.
- Advertisement -