హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్తులతో కులదేవత ఎల్లమ్మ తల్లిపై ప్రమాణం చేయించారు. ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి 10 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ధర్మారెడ్డి వ్యవహరంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రజల హక్కు అని, ఎవరికి ఓటు వేయాలన్నది ఓటర్లే నిర్ణయించుకుంటారని మండిపడుతున్నారు.