Sunday, November 24, 2024

MLA Bigala Ganesh – కేసిఆర్ పాలన లో ఆధ్యాత్మిక వైభోగం..

నిజామాబాద్ సిటీ ,జూన్ (ప్రభ న్యూస్) 21: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆలయాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకొని ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరజిల్లుతు న్నాయనీ అర్బన్ ఎమ్మేల్యే గణేష్ బిగాల అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నీల కంటేశ్వర ఆలయం లో, సి ఎస్ ఐ ర్చిలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలా ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే గణేష్ బిగాల మాట్లాడు తూ..ఆధ్యాత్మికత ఉట్టిప డేలా,అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యం చరిత్రలో నిలిచి పోయే విధంగా యాదాద్రి నిర్మా ణం పట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.9ఏండ్లలో ఆలయ అభివృద్ధి కి 2500 కోట్ల కేటాయించారన్నారు.లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండి యాగం నిర్వహించడం, యాగ ఫలం తోనే వల్లే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా మారిందన్నారు.బతుకమ్మ,రంజాన్,క్రిస్టమస్ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ తెలిపారు.లోక కళ్యాణార్థం మహచండి యాగం,సుదర్శన యాగం అనేక పూజలు నిర్వ హించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన యాగ ఫలాల తోతెలంగాణ రాష్ట్రం సస్యశ్యా మలం మారిందన్నారు. భగవం తునికి ,భక్తులకు వారధిగా ఉన్న అర్చకులకు వేతనాలు పెంచి వారి గౌరవాన్ని నిలిపా రనీ పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషిచేశారు.రూ.1250 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పునర్:నిర్మాణం చేసి కలియుగ వైకుంఠం గా తీర్చిదిద్దారనీ వివరించారు. వేములవాడ రాజన్న, ధర్మ పూరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను రూ 100 కోట్ల తో అభివృద్ధి చేస్తుందన్నారు. భద్రా ద్రి రామ చంద్ర ఆలయం అభి వృద్ధి కి ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు.కాకతీయుల కళ వైభవానికి చిహ్నంగా ఉన్న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

శబరిమల, కాశీ కి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతి గృహం ప్రభుత్వం నిర్మిస్తుందనీ తెలిపారు. సరి కొత్త ఆద్యాత్మిక వైభవాన్ని తీసుకవచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూ ర్తిగా ప్రార్థిస్తున్నాననీ తెలిపారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో బ్రాహ్మణులను శాలువాతో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో నగర మేయర్ దండు నీతూ కిర ణ్ ,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు ,నుడ చైర్మన్ శ్రీ ప్రభాకర్ రెడ్డి ,సుజిత్ సింగ్ ఠాకూ ర్,సత్య ప్రకాష్,సిర్ప రా జు,కంటేశ్వర్ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిళ్ళ మహే ష్,ప్రధాన కార్యదర్శి కులచారి సంతోష్,కోశాధికారి హరి బాబు,సభ్యులు ఇరుముల శంకర్,కసుభ సంపత్,చిన్నం గారి గంగ రెడ్డి,నర్సింగ్ పల్లి అశోక్,కంచెట్టి వర లక్ష్మీ,గోపరి గంగాదర్, వేముల భుమే ష్ ,కొండవత్రి రాజేందర్, జుంభారతి గంగామని, కార్య నిర్వహాణాధికారి వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement