Monday, November 18, 2024

ఇందూరు యువత సేవలు అభినందనీయం

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ (ప్రభ న్యూస్) 26: అనాధ శవలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్నారనీ.. సమాజ సేవా కార్యక్రమాలు చేపట్ట డంలో ఇందూర్ యువత సేవలు అభినంద నీయమని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బుధ వారం నగరంలోని గుర్బ బాధి రోడ్డులోని ఇందూరు యువత స్వచ్చంధ సేవ సంస్థ కార్యాల యాన్ని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ… ఇందూ రు యువత స్వచ్చంధ సేవ సంస్థ సభ్యుల సమాజ సేవ గురించి మనందరికీ విదితమే.


కరోన సమయంలో భోజనం పంపిణీ , విధి వెక్కిరించిన వారిని ఆదరించడం పై హర్షం వ్యక్తం చేశారు. ఇందూరు యువత సభ్యులందరికి వెన్ను దన్నుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తాననీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్య క్రమాలు నిర్వహించాలని మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాననీ తెలిపారు. అనంతరం ఇందూ రు యువత సభ్యులు అర్బన్ ఎమ్మెల్యేను శాలువాతో ఘనం గా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్,దారం సాయిలు, ఇందూరు యువత సేవ సంస్థ సభ్యులు సాయి బాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement