Tuesday, November 26, 2024

తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనరు?

పంజాబ్ లో పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో పండిన ధాన్యాన్ని ఎందుకు కొనరని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ ప్రశ్నించారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో రెండు పంటల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని అన్నారు. తెలంగాణలో రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని నిలదీశారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement