Friday, September 20, 2024

MLA Arrest – కౌశిక్ ఇంటిపై రాళ్ల దాడి – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్ …

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వ‌ద్ద ర‌ణ‌రంగం వాతావర‌ణం నెల‌కొంది.. ఆయ‌న ఇంటిపై పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి కాంగ్రెస్ కార్య‌కర్తలు దాడి చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.. కాగా, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో పొలిటికల్ హీట్ నెలకొంది. కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి అరెకపూడి గాంధీ పెద్ద ఎత్తున తన అనుచరులతో బయల్దేరి వెళ్లారు.అంతకు ముందు గాంధీ ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ కండువా కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దీనిపై అరెకపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డిలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తన ఇంటికి ఆయన రాకపోతే.. తానే ఆయన ఇంటికి వెళతానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరెకపూడి గాంధీ వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కొంతమంది అరెకపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు.


కౌశిక్ రెడ్డి ఇంటివద్ద తన అనుచరులతో కలిసి అరెకపూడి గాంధీ బైరాయించారు. పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని.. లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అరెకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు.

ఆయ‌న ఇంటిపై పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి కాంగ్రెస్ కార్య‌కర్తలు దాడి చేశారు. పాడి ఇంట్లోకి అరికెపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకెళ్లారు. కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీ గేట్లు ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

అంతకుముందు అరెకపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతూ, బిఆర్ ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. ఆయన తీరు వల్లే ఆ పార్టీ ఓటమి పాలైందని విమర్శించారు. ఆయన కోవర్టుగా వ్యవహరించారన్నారు. కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసుకోకుండా బిఆర్ఎస్ లో స్థానం కల్పించారని మండిపడ్డారు. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement