తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబం ఆర్థికంగా, సామజికంగా పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన గొప్ప పథకం దళిత పథకమని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో దళిత బందు అమలుపై నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దళితుల పట్ల ఉన్న ఆలోచన విధానానికి నిదర్శనం ఈ దళిత బందు పథకమని అన్నారు. వంద శాతం రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి దళిత బందు వస్తుందని హామీ ఇచ్చారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 100యూనిట్లను కేటాయించినట్లు తెలిపారు. అందులో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో 100యూనిట్లను ఈ ప్రాతిపదికన అమలు చేయాలి అనే అంశంపై ప్రజా ప్రతినిధులు, నాయకుల సలహాలు సూచనలు తీసుకున్నారు. దీనిపై త్వరలోనే దళిత బందు కమిటీలను సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు అందరి ఏకభిప్రాయంతో దళిత బందు అమలుకు కృషి చేయాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement