హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలు మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రూ.80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్‌డీపీ కింద ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ వల్ల ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా, కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital