హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తున్నాయి. 90శాతంగ్రామీణ,పట్టణ ప్రాం తాలకు తాగునీరు అందించిన ప్రభుత్వం మిగతా గ్రామాలకు గునీరుఅందించేందుకు చేపట్టిన పనులు చివరిదశలో ఉన్నాయి. ప్రస్తుతం 24,225 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాన్ని కేంద్రం అనుకరించినా ఫలితాలు సాధించకపోవడంతో జాతీయ పార్టీగా అవతరిం చిన బీఆర్ఎస్ ఎన్నికల అజెండాలో మిషన్ భగీరథకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
నిజాం పాలనలో సర్కార్ నల్లా బారాగంటా కుల్లా అనే నానుడి ఉన్నప్పటికీ సమైఖ్యపాలకులు తాగునీటిని నిర్లక్ష్యం చేయడంతో బిందెడునీళ్లకోసం మైళ్ల కొద్ది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కరువులో చిక్కుకున్న తెలంగాణలో వర్షం కురిస్తేనే గుక్కె డు నీళ్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జీవ నదులు ప్రవహి స్తున్నప్పటికీ ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య ఏర్పడింది. అయితే తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ ప్రజల కష్టాలను ప్రత్యేక్షంగా చూసి రాష్ట్రం అవతరించగానే పరిష్కార మార్గాలవైపు దృష్టి సారించారు. 1996లో సిద్దిపేటలో కేసీఆర్ రూ.60 కోట్లతో ప్రారంభించిన ఇంటింటికి తాగునీరు పథకాన్ని విస్తరించి మిషన్ భగీరథ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం నీటినిల్వకోసం నిర్మించిన ప్రధాన 19 జలాశయాల నుంచి హైకెపాసిటీ మోటర్లు, భారీ పైపులైన్ల ద్వారా జలాశయాల దగ్గర ఉన్న 50 వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు పంప్ చేసి రోజుకు 3వేల 349 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన నీటిని మిషన్ భగీరథ పథకంపేరుతో నల్లాల ద్వారా లక్షలాది ఇళ్లకు నీటిని సరఫరా చేస్తు న్నారు. ఈ నీటిని నాలుగు దశల్లో శుద్ధిచేసి సరఫరాచేస్తున్నారు. భారత ప్రభుత్వ సంస్థ వ్యాప్ కాస్ పరిశోధన లతో నీటి శుద్ధిని పరిశీలించిన అనంతరమే సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం 255పంపుహౌజ్‌ల ద్వారా 35,422 ఓవర్ సర్వీసు రిజర్వాయర్ల ద్వారా ఇంటింటికి రాష్ట్ర ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఇప్పటి వరకు లక్షా 69వేల 705 కిలోమీటర్ల పైపులైన్ 66 పట్టణ స్థానిక సంస్థలు 24,225 గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి రక్షిత తాగునీటిని అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు అనేకం వచ్చా యి. ఈ అభివృద్ధి నమూనాను జాతీయ స్థాయిలో విస్తరించేం దుకు అధికార బీఆర్ఎస్ యోచిస్తోంది. దేశంలో అనేక జీవ నదులు ఉన్నప్పటికీ తాగునీటి గోస తీరకపోవడంపై సీఎం కేసీఆర్ సారించిన దృష్టి భవిష్యత్‌లో మంచి ఫలితాలు సాధిస్తుందని జల నిపుణులు భావిస్తున్నారు.