కరీంనగర్ కు చెందినసీనియర్ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్‌రావు బుధవారం సాయంత్రం అదృశ్యం కాగా శుక్రవారం సాయంత్రం మనకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద కాకతీయ కెనాల్ లో శవమై తేలాడు.. వివరాలలోకి వెళితే కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్‌రావు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది.బుధవారం సాయంత్రం ఆయన ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ అల్గునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన ఉన్నాయి. కెనాల్ పక్క నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం సెల్‌ఫోన్ మోగుతుండటంతో లిఫ్ట్ చేసి అవతలి వారికి విషయం చెప్పాడు.
కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి న్యాయవాది భార్య కరీంనగర్ రెండో ఠాణాలో భర్త వేణుగోపాల్‌రావు కనిపించడంలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
గురువారం ఉదయం కెనాల్ నీటిని తగ్గించి రెస్క్యూ టీమ్ ద్వారా వెతకడం ప్రారంభించారు.శుక్రవారాం ముంజంపల్లి వద్ద శవమై తెలాడు. వేణుగోపాల్ రావు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఏదయినా జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేణుగోపాల్ రావు కాల్ డేటాను సేకరిస్తున్నారు. వేణుగోపాల్ రావు మృతి పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్‌రావు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, అదనపు ప్రభుత్వ న్యాయవాది పూరెల్ల రాములు, న్యాయవాదులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు