Saturday, September 7, 2024

Missing – అమెరికాలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థిని అదృశ్యం

అమెరికాలో తెలంగాణ హైదరాబాద్ కు చెందిన యువతి.. అదృశ్యమైంది.. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల అమెరికాలో గత నెల 28 నుంచి కనిపించడం లేదు.. కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో ఆమె చదువుతోంది.. మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. నితీషా కందుల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు.

.కాగా.. ఈ ఘటనకు ముందు అమెరికా చికాగోలో 25 ఏళ్ల తెలంగాణ విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అనే విద్యార్థి కూడా అదృశ్యమయ్యాడు. చంద్ర విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. దీనికి ముందు అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ నగరంలో 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అదృశ్యమయ్యాడు. అనంతరం శవమై కనిపించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement