భారత అమ్ముల పొదిలో మరో అద్భుత అస్త్రం చేరింది. డీఆర్‌డీవో ప్రళయ్ క్షిపణి పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని బాలాసోర్ కేంద్రం నుంచి మిస్సైల్ పరీక్షను నిర్వహించింది. బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించి డీఆర్‌డీవో మరోసారి తమ సత్తాను చాటింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఘన-ఇంధన, యుద్ధభూమి క్షిపణి భారతీయ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం నుండి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది. అత్యాధునిక ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి ‘ప్రళయ్’ని విజయవంతంగా ప్రయోగించినందుకు కూ యాప్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి @DRDO_Indiaకి అభినందనలు .ప్రధాన సైనిక సాంకేతిక ఆవిష్కరణ, ఆవిష్కరణలతో భారతదేశం గొప్ప పురోగతిని సాధిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital