జీతం బిల్లు జారీకి లంచం డిమాండ్
ఆంధ్రప్రభ స్మార్ట్, ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఏసీబీ దాడి చేసి లంచం డిమాండ్ చేసిన ప్రధానోపాధ్యాయుడు భీమనపల్లి కృష్ణను పట్టుకున్నారు. జీతం బిల్లు జారీ చేయడానికి రెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఆ టీచర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం దాడి చేసి హెచ్ఎం భీనపల్లి కృష్ణను పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.
పట్టుబడిందిలా….
ఇల్లందు మైనార్టీ పాఠశాలలో ఒక టీచర్ జీతం చేయడానికి పది వేల రూపాయలను ప్రధానోపాధ్యాయుడు భీనపల్లి కృష్ణ డిమాండ్ చేశారు. అయితే అంతా ఇచ్చుకోలేను రెండు వేల రూపాయలు ఇస్తానని హెచ్ఎంను ఒప్పించారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ వేసిన ప్రణాళిక ప్రకారం హెచ్ఎం కృష్ణకు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు రూ.రెండు వేలు ఇవ్వగా, ఆ డబ్బులు అటెంబర్ కిచ్చెల్లి రామకృష్ణకు ఇవ్వాలని చెప్పడంతో అలానే డబ్బులు ఇచ్చారు. ఇంతలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. హెచ్ఎం అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని, ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రికార్డులు పరిశీలిస్తున్నారు.