హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేయనున్నట్టు హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. చెక్కులను మొదట 16న పంపిణీ చేయాలని భావించామని, అయితే వరుసగా బ్యాంకు సెలవులు రావడంతో తేదీని మార్చినట్టు తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 3,600 మందికి చెక్కులు అందించనున్నట్టు పేర్కొన్నారు.
కాగా, మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ అస్రార్ పైలట్ శిక్షణకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.35 లక్షలు విడుదల చేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అలాగే సాల్వి ఫాతిమా పైలట్ విద్యకు తెలంగాణ ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. త్వరలో ముస్లింల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని హోంమంత్రి వివరించారు..