Friday, November 22, 2024

మైనర్ బాలికపై అత్యాచారం

వసతి గృహం నుంచి ఇంటికి వచ్చిన చిన్నారిపై కన్ను… చంపేస్తనని బెదిరించి లొంగదీసుకున్న వైనం.
ఖమ్మం జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలో ఉన్న చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఓ బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యం సంచలనం సృష్టించింది. లచ్చగూడెం గ్రామంలో కస్తూరిబా బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న మైనర్ బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఉదంతమిది. ఆ గ్రామానికి చెందిన చిన్నారి వసతి గృహంలో 9వ తరగతి చదువుకుంటోంది. తల్లి చిన్నతనంలోనే చనిపోయి మాతృ ప్రేమకు దూరమైన ఆ చిన్నారి తండ్రి ఆలనా పాలనకు కూడా దూరమైంది. భార్య మరణంతో ఆ బాలిక తండ్రి తాగుదుకి బానిసగా మారిపోయాడు. కుటుంబ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఆ బాలికకు చదువు పట్ల ఎనలేని శ్రద్ధ ఉండేది. ఈ విషయాన్ని గమనించిన ఆ గ్రామానికి చెందిన కొందరు పెద్దలు ఆ బాలికకు ఓ మార్గం చూపించేందుకు నడుం బిగించారు. చొరవ చూపి కస్తూర్బా బాలికల వసతి గృహంలో చేర్పించడంతో ఆ చిన్నారి ఇప్పుడు 9వ తరగతి కి వచ్చింది. -అంతలోనే కామాంధుడి కన్ను.. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఆ చిన్నారి కలల సౌధం ఒక్కసారిగా కూలింది.

వారం రోజుల కిందట ఇంటి దగ్గర ఉన్న తన తండ్రిని చూసేందుకు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ఆ బాలికపై అదే గ్రామంలో ఉంటున్న బెజ్జలబోయిన నాగరాజు(40) అనే కామాంధుడి కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పధకం ప్రకారం ఆ చిన్నారి ఒంటరిగా ఉన్న సమయం చూసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనకు లైంగికంగా సహకరించకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. కత్తితో పొడిచి చంపి శవం కనిపించకుండా చేస్తానని బెదిరిస్తూ ఆ చిన్నారిపై వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. తల్లి ప్రేమ కరువైన ఆ బాలిక తండ్రితో ఈ విషయాన్ని చెప్పుకోలేక కుమిలిపోయింది. ఆ తర్వాత ఇంటి నుంచి హాస్టల్ కి తిరిగి వెళ్ళిన ఆ చిన్నారి తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియచెప్పింది. రోజులుగా ఓ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్న తీరును వారితో మొరపెట్టుకుంది. దీంతో వెంటనే స్పందించి అప్రమత్తమైన ఉపాధ్యాయులు విషయాన్ని ఐసిడిఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐసిడిఎస్ అధికారులు హుటాహుటిన వసతి గృహానికి చేరుకొని బాలిక నుంచి పూర్వాపరాలు సేకరించారు. అక్కడి నుంచి చింతకాని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బాలిక తో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై వైరా ఏసిపి రెహమాన్ వెంటనే స్పందించి కేసును దర్యాప్తు చేసి నిందితుడు నాగరాజు పై అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. చింతకాని ఎస్ఐ పొదిలి వెంకన్న పోలీస్ సిబ్బంది కలిసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement