Wednesday, November 27, 2024

గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

భద్రాద్రి కొత్తగూడెం . వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోటుకు మరో బాలిక బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంకు చెందిన నిహారిక(13) గుండెపోటుతో చనిపోయింది. తనకు కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు నిహారిక చెప్పగా, మణుగూరులో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా కుప్పకూలింది. వైద్యులు పరీక్షించి నిహారిక గుండెపోటుతో చనిపోయిందని నిర్ధారించారు. చిన్న వయసులోనే గుండెపోటుతో తమ కుమార్తె మరణించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement