వరంగల్ నగరంలో రూ.3 కోట్ల వ్యయంతో 1040 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రణాళిళా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… నేడు ధార్మిక భవన్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ..
అంతకుముందు వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామి వారిని, భద్రకాళి అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులను అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు, ఈవో పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.