Monday, January 13, 2025

Ministers Tour – నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ఐదుగురు మంత్రులు

హైదరాబాద్ – ఖమ్మం జిల్లాలో నేడు ఐదుగురు మంత్రులు పర్యటించబోతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించబోతున్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంఖుస్థాపన చేయనున్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈరోజు ఉదయం 9: 30గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలపై మంత్రులు, ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో జరిగే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -

అనంతరం రాత్రి మధిరలో బస చేసి మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కి తిరిగి వెళ్లనున్నారు. ఇక, ఖమ్మం జిల్లాలో ఐదుగురు మంత్రులు పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement