Tuesday, November 26, 2024

TS: మేడారం తల్లులను దర్శించుకున్న మంత్రులు సీత‌క్క‌, పొంగులేటి….

ములుగు ప్ర‌తినిధి, ప్ర‌భ‌న్యూస్ః ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ తల్లులను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా హెలికాప్ట‌ర్ ద్వారా మేడారం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ త్రిపాఠిలు స్వాగతం పలికారు.

అనంతరం ఆలయానికి చేరుకొని తులాభారం లో కూర్చొని ఎత్తు బంగారం సమర్పించారు పొంగులేటి.. అనంత‌రం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ని మంత్రి సీతక్క,సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత రావు లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అలాగే ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద, హోమియో,యునానీ మెగా వైద్య శిబిరాన్ని పొంగులేటి, సీతక్కలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement