Monday, November 18, 2024

TS: మేడారం తల్లులకు మొక్కులు చెల్లించుకున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు: తాడ్వాయి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను ఇవాళ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ లు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ముందుగా దేవాదాయ శాఖ అధికారులు మంత్రులకు సాంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికి అమ్మవార్ల గద్దెకు తీసుకెళ్లారు. మంత్రులు తల్లులకు చీర, సారె, పసుపు కుంకుమ, పండ్లు చెల్లించి, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పి శబరిస్.పి,అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement