Tuesday, December 3, 2024

MDK | గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేసిన మంత్రులు

సంగారెడ్డి, నవంబర్ 6 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని గీత కార్మికులకు సేఫ్టీ కిట్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రమాదాల వలన పెద్ద మొత్తంలో కార్మికులు తాడిచెట్లపై నుండి పడి చనిపోవడం జరుగుతుందని, వారి వృత్తిని, గీత కార్మికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

గీత కార్మికులు తాడిచెట్లపై నుండి ప్రమాదవశాత్తు పడి చనిపోయే మరణాల రేటును తగ్గించడానికి ఈ సేఫ్టీ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు గీత కార్మిక సంఘాల నాయకులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement