రైతుల నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్ పార్టీ లాగిపారేసిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగంలో ఆయన బీఆర్‌ఎస్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిందనే విషయాన్ని తాను చెప్తే అందులో తప్పేముందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని ఓటర్లకు హరీష్‌రావు పిలుపిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగిపోతుందని అన్నారు. తాము ఎకరానికి 10వేలు ఇస్తున్నామని, కాని కాంగ్రెస్ మాత్రం భూమితో సంబంధం లేకుండా రైతుకు 15 వేలు మాత్రమే ఇస్తానని చెప్తోందని హరీష్ రావు వివరించారు. రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్‌కు రైతులు బుద్ధి చెప్తారని హరీష్‌రావు హెచ్చరించారు.