నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం దేవక్కపేట గ్రామం నుంచి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు,కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మంత్రి స్వాగతం పలికారు. నేటి నుంచి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులని మీకు అన్ని విధాల టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
అభివృద్ధి గురించి గ్రామాల్లో చర్చ జరగాలని మంత్రి వేముల అన్నారు. కేసిఆర్ రాక ముందు.. కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ది గురించి మాట్లాడుకోవాలి తెలిపారు. 24 గంటల కరెంట్,రైతు బంధు,రైతు భీమా,సాగునీరు,చెక్ డ్యాముల నిర్మాణం,ఆసరా పెన్షన్,గ్రామాల్లో అభివృద్ధి ఇవన్నీ గతంలో లేవన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి పల్లెల రూపు రేఖలు మర్చుకున్నమని తెలిపారు. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. మంచి జరుగుతున్నప్పుడు మంచి చేసే వారికి కచ్చితంగా ప్రోత్సాహం అందించాలని, మీ బంధువులతో చర్చించాలని మంత్రి కోరారు.