Home తెలంగాణ‌ TG | ర‌బీ సాగుకు నీరు విడుద‌ల చేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

TG | ర‌బీ సాగుకు నీరు విడుద‌ల చేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

0
TG | ర‌బీ సాగుకు నీరు విడుద‌ల చేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

కామారెడ్డి – రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు రైతులకు నేడు నీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దిలారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఉత్తమ్ కుమార్ వెంట మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంత్ రావు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంత‌రం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని వివరించారు. వందేళ్ల చరిత్ర గల ప్రాజెక్టు నిజాం సాగర్ అని.. ఇది నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. ఆన్ ఆఫ్ మోడ్‌లో సాగునీటిని అందిస్తామని తెలిపారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి రైతుల‌కు హామీ ఇచ్చారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Exit mobile version