రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం మిర్చి మార్కెట్‌ను సందర్శించారు. తేమశాతం పేరిట వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో ఆయన మార్కెట్లో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ వ్యాపారులు తేమ శాతంతో ఉన్న రేటును తగ్గిండం సరికాదంటూ సూచించారు. వాస్తవ ధర రైతులకు వర్తింపజేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
క్వాలిటీ ఉన్న మిర్చి కూడా తక్కువ ధరకు కొనడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసారు. మిర్చి ధర తగ్గడంపై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ని ఖమ్మం రావాలని ఆదేశించారు. రైతులు మోస పోకుండా ఇతర శాఖలను సమన్వయం చేసుకొని రైతుకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.