తెలంగాణలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపలను, రొయ్యలను భారీ ఎత్తున పెంచుతున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. దీంతో ఇప్పుడు చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని మంత్రి తలసాని వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement